World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్)లు దంచేస్తున్నారు. షఫాలీ పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతుండగా.. మంధాన సులవుగా ఫోర్లు బాదేస్తోంది. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతుండడంతో స్కోర్ బోర్డును ఉరికిస్తున్నారు. తొలి ఓవర్ మెయిడెన్ అయినా.. రెండో ఓవర్ నుంచి గేర్ మార్చిన ఇద్దరూ 41 బంతుల్లోనే 51 రన్స్ సాధించారు. పేసర్లు తేలిపోవడంతో రంగంలోకి దిగిన స్పిన్నర్ ఎలంబా ఈ జోడీ దూకుడు కాస్త బ్రేకులు వేసింది. దాంతో.. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది టీమిండియా.
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో భారత జట్టుకు శుభారంభం లభించింది.బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్). సఫారీ ప్రధనా పేసర్ మరిజానే కాప్ తొలి ఓవర్లో ఒక్క పరుగు తీయలేదు. కానీ, రెండో ఓవర్లోనే ఖాకాకు షఫాలీ బౌండరీతో స్వాగతం పలికింది.
A strong start for #TeamIndia 👏
Vice-captain Smriti Mandhana and Shafali Verma bring up a 5⃣0⃣-run opening stand 👌
Updates ▶️ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final | @mandhana_smriti | @TheShafaliVerma pic.twitter.com/bilW7erTxh
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
ఇక నాలుగో ఓవర్లో కాప్ను బెంబేలెత్తిస్తూ వరుసగా రెండు ఫోర్లు కొట్టింది లేడీ సెహ్వాగ్. ఖాక వేసిన ఆరో ఓవర్లో మంధాన రెండు వరుస బౌండరీలతో స్కోర్ 40 దాటించింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిధాలీ రాజ్ రికార్డును బ్రేక్ చేసింది మంధాన. 2017 వరల్డ్ కప్లో 409 పరుగులతో మాజీ కెప్టెన్ నెలకొల్పిన రికార్డును దాటేసింది.