లండన్: 44 ఏళ్ల వయసులో సెరీనా విలియమ్స్(Serena Williams).. వింబుల్డన్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. వైల్డ్‌కార్డు ఎంట్రీతో టోర్నీలో ఆడిన మాజీ చాంపియన్.. మంగళవారం తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. 23 గ్రాండ్ స్లామ్ టోర్నీలు గెలిచిన సెరీనా.. తొలి రౌండ్లో 20 ఏళ్ల ఆస్ట్రేలియా ప్లేయర్ మాయా జాయింట్ చేతిలో 6-3, 6-7 (6), 6-3 స్కోరు తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ వింబుల్డన్‌లో సెరీనా అడుగుపెట్టింది. ఏదైనా అద్భుతం చేస్తుందో ఏమో అని ఆమె అభిమానాలు ఎదురుచూశారు. భర్త , ఇద్దరు పిల్లలు కూడా ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చారు. కానీ అనూహ్య రీతిలో సింగిల్స్ మ్యాచ్‌లో సెరీనా విలియమ్స్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.
తన కన్నా సగం వయసున్న ఆస్ట్రేలియా ప్లేయర్ మాయాతో కొంత వరకు ధీటుగానే పోరాడింది. సర్వీసును దాదాపు 129 మీటర్ల వేగంతో కొట్టింది. గ్రౌండ్ స్టోక్స్ కూడా సెరీనా బాగానే ఆడింది. కానీ ప్రత్యర్థి మాయా.. సెరీనాను పరుగెత్తించింది. వింబుల్డన్‌లో మళ్లీ ఆడడం ఆనందంగా ఉందని, మళ్లీ వస్తానా రానో అనుకున్నట్లు చెప్పింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో సెరీనా మీటింగ్ కాలేదని వింబుల్డన్ నిర్వాహకులు తెలిపారు.
Maya Joint takes down Serena Williams in three sets in the legend's return to Wimbledon‼️ pic.twitter.com/fOnON4NkRX
— ESPN (@espn) June 30, 2026