Serena Williams : పురుషుల టెన్నిస్‌లో దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వీడ్కోలు తర్వాత కొత్త తారలు దూసుకొచ్చారు. వెటరన్ ప్లేయర్ అయిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)ను నిలువరిస్తూ టైటిళ్లు పట్టేస్తున్నారు. అయితే.. జోకో నెలకొల్పిన అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డు మాత్రం బ్రేక్ చేయడం గగనమే. ఎందుకంటే ఇప్పటికైతే అతడికి దరిదాపుల్లో ఎవరూ లేరు. కానీ, కార్లోస్ అల్కరాస్ (Carlos Alcaraz)కు ఆ దమ్ముందని.. అతడు జకోను అధిగమించి ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తాడని అంటోంది మాజీ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ (Serena Williams).
‘టెన్నిస్ ఆటలో స్పానిష్ వాళ్ల ఆధిపత్యం ఎప్పటి నుంచో ఉంది. ఇదివరకూ రఫెల్ నాదల్… ఇప్పుడు అల్కరాస్. ఈమధ్య కాలంలో ఈ యంగ్‌స్టర్ అద్భుత విజయాలతో అదరగొడుతున్నాడు. నేను అతడికి పెద్ద అభిమానిని. ప్రతిసారి మ్యాచ్‌కు ముందు అతడికి ఫోన్ చేసి విజయం సాధించాలని చెబుతాను అని సెరెనా వెల్లడించింది. జకోవిచ్ తన పేరిట రాసుకున్న అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డును బ్రేక్ చేసేది ఎవరు? అనే ప్రశ్నకు ఇంకెవరు మన అల్కరాస్ అని ఠక్కున చెప్పేసిందీ అమెరికా లెజెండ్. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న అతడు జకో రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇప్పటివరకూ అతడు ఆరు టైటిళ్లు సాధించాడు. ఇదే జోరు చూపిస్తే అతడికి రికార్డు బద్ధలుకొట్టడం కష్టమేమీ కాదు. ఎందుకంటే.. టెన్నిస్‌లో ఏదైనా సాధ్యమేన’ని వివరించింది నల్ల కలువ.
“I’m an unconditional fan of Carlos. I always call him when he plays, to cheer him on.” — Serena Williams on Carlos Alcaraz pic.twitter.com/wwWt8KoFCn
— alcaraz archive (@alcarchive) October 23, 2025
మహిళల టెన్నిస్‌లో దిగ్గజ ప్లేయర్ అయిన సెరెనా 23 గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టింది. సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్‌లోనూ ట్రోఫీలు గెలుపొందిందీ క్వీన్. టీనేజ్ సంచలనంగా దూసుకొచ్చి.. టెన్నిస్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన సెరీనా.. 2022లో వీడ్కోలు పలికింది. వ్యక్తిగత జీవితంతో పాటు.. తన సొంత కంపెనీ బాధ్యతలు చూసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతూ సుదీర్ఘ కెరీర్‌కు అల్విదా చెప్పేసింది గ్రేటెస్ట్ టెన్నిస్ ప్లేయర్.
Legends win Tokyo on the first try!
🏆 Roger Federer, 2006
🏆 Rafael Nadal, 2010
🏆 Novak Djokovic, 2019
🏆 Carlos Alcaraz, 2025 pic.twitter.com/H3egPDA5DE— Bastien Fachan (@BastienFachan) September 30, 2025
ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో జకోవిచ్ ఆధిపత్యానికి గండికొడుతున్నాడు అల్కరాస్. ఇటలీ కెరటం జనిక్ సినర్ కూడా సంచలన ఆటతో టాప్ సీడ్లతో పోటీకి సై అంటున్నారు. గతరెండేళ్లుగా ఈ ముగ్గురి మధ్యే కోర్ట్ వార్ నడుస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్..ఒలింపిక్స్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించాడు అల్కరాస్. గాయాలతో బాధపడుతున్న జకో..మరో ఏడాది మాత్రమే ఆడే అవకాశముంది. ఆలోపు అతడు 25వ గ్రాండ్‌స్లామ్ సాధిస్తాడా? అనేది చెప్పలేం.
1. నొవాక్ జకోవిచ్(సెర్బియా) – 24.
2. రఫెల్ నాదల్(స్పెయిన్) – 22.
3. రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) – 20.
4. పీట్ సాంప్రాస్(అమెరికా) – 14.
5. రోయ్ ఎమెర్సన్ (ఆస్ట్రేలియా) – 12.