మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ వరుస రికార్డుల పరంపర కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ 6-3, 6-4, 7-6(4)తో బోటిక్ వాన్ డీ జాన్షుల్ప్పై అద్భుత విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఓవరాల్‌గా 400 విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డుల్లోకెక్కాడు. తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు దక్కించుకున్న ఈ సెర్బియా స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గెలుపు, ఓటముల రికార్డు(102-10)ను మరింత మెరుగుపర్చుకున్నాడు. మరో సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్ 4-6, 6-3, 6-4, 6-4తో స్పిజిరి(అమెరికా)పై విజయం సాధించాడు.