Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో పాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. దీనికి తోడు దేశీయ కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండవచ్చన్న నివేదికల మధ్య మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 78,319.45 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సెన్సెక్స్ పతనమైంది. మళ్లీ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 78,319.45 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక 77,486.79 పాయింట్ల కనిష్ఠాన్నికి చేరుకుంది. చివరకు 50.62 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18.95 పాయింట్లు పతనమై.. 23,688.95 వద్ద ముగిసింది.
టేడ్రింగ్లో దాదాపు 1,336 షేర్లు లాభాల్లో కొనసాగగా.. మరో 2,466 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. అపోలో హాస్పిటల్స్, ట్రెంట్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్, ఐటీ 0.3శాతం నుంచి 1.5శాతం, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా మెటల్, మీడియా, బ్యాంక్, ఆటో సూచీ ఐటి 0.3-1.5 శాతం వరకు పెరిగాయి. మంగళవారం ముగింపు పోలిస్తే.. బుధవారం డాలర్‌తో రూపాయి 13 పైసలు తగ్గి 85.85 వద్ద ముగిసింది. అమెరికా కరెన్సీ బలపడడం, ముడి చమురు ధరలు పెరగడం తదిత కారణాలతో రూపాయి పతనం కొనసాగింది.