Vijay Hazare Trophy : అంతర్జాతీయ మ్యాచుల్లో టన్నుల కొద్దీ పరుగులతో రికార్డులు నెలకొల్పిన భారత స్టార్లు దేశవాళీలోనూ చితక్కొడుతున్నారు. వన్డే ఫార్మాట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)ఎలైట్ 2025-26లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు శతకాలతో రెచ్చిపోతున్నారు. రో-కోకు పోటీగా ఇషాన్ కిషన్, రింకూ సింగ్, వైభవ్ సూర్యవంశీ, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ షోరే వంటి.. కుర్రాళ్లు సైతం సెంచరీలతో విరుచుకుపడుతున్నారు. దూకుడే మంత్రగా ఆడుతున్న వీరు తమ జట్లను ఒంటిచేత్తో గెలిపిస్తున్నారు. దాంతో.. ఈ ట్రోఫీకి వేదికైన స్టేడియాలు ప్రేక్షకుల అరుపులతో దద్ధరిల్లుతున్నాయి.
ఒకప్పుడు దేశవాళీ ట్రోఫీల మ్యాచ్‌లకు ఆదరణ కరువయ్యేది. కానీ, బీసీసీఐ ఆదేశాలతో సీనియర్లు సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ అభిమానులను రంజింపజేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వస్తూ వస్తూనే విజయ్ హజారే ట్రోఫీలో శతకాలతో కదం తొక్కారు. ఢిల్లీ తరఫున విరాట్.. ముంబై ఆటగాడిగా హిట్‌మ్యాన్ సెంచరీలతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. వీరిద్దరి స్ఫూర్తితో జూనియర్లు సైతం శతకాలతో అభిమానులతో కేక పెట్టిస్తున్నారు.
RoKo’s last two scores in the Vijay Hazare Trophy 🏏 pic.twitter.com/WyIjCMqUIG
— CricketGully (@thecricketgully) December 26, 2025
టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లోని టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లోని ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనె సెంచరీతో రెచ్చిపోగా.. రింకూ సింగ్ శుక్రవారం విధ్వంసక ఆటతో 60 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ మూడంకెల స్కోర్‌తో జట్టుకు విజయం కట్టబెట్టాడు. తొలి పోరులో జార్ఖండ్‌పై 147, శుక్రవారం కేరళపై124 రన్స్‌తో చెలరేగాడీ ఆర్సీబీ స్టార్. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 36 బంతుల్లోనే సెంచరీతోబౌలర్లకు దడ పుట్టించాడు.
At just 14, Vaibhav Suryavanshi stacking hundreds across IPL, youth cricket, India A, SMAT, VHT and U19 Asia Cup feels unreal — a true glimpse of India’s future. 🇮🇳🌟 pic.twitter.com/5axpZikU7L
— oddsplay (@teamoddsplay) December 24, 2025
🚨 DHRUV SHOREY CREATED HISTORY 🚨
Dhruv Shorey scored 5 consecutive Hundreds in Vijay Hazare Trophy – Joint Most in the VHT History. 😱🥶 pic.twitter.com/TntaJYTdS8
— Tanuj (@ImTanujSingh) December 26, 2025
ఇక ఈ టోర్నీతో తాను ప్రత్యేకమని చాటుతూ వరుసగా ఐదు మ్యాచుల్లో సెంచరీతో రికార్డు సృష్టించాడు. విజయ్ హజారేలో చెలరేగి ఆడుతున్న ధ్రువ్ షొరే వరుసగా 110, 114, 118, 136, 109 నాటౌట్‌తో రాణించాడు. తద్వారా లిస్ట్ -ఏలో ఎన్ జగదీశన్ రికార్డును సమం చేశాడీ హిట్టర్. నిరుడు క్వార్టర్ ఫైనల్లో రాజస్థాన్‌పై 118 నాటౌట్‌తో మెరిసిన అతడు.. సెమీఫైనల్లోనూ 114, ఫైనల్లో 110 తో విరుచుకుపడిన ధ్రువ్,. ఈసారి బెంగాల్‌పై 136, హైదరాబాద్‌పై 109 నాటౌట్‌తో మెరిశాడు.
🚨 First time in the history of Cricket, something historic happened in India 🇮🇳
– 22 Batters scored hundred on Day 1 in Vijay Hazare Trophy 2025-26 🔥
– Virat Kohli, Rohit Sharma, Ishan Kishan, Vaibhav Suryavanshi and other 18 scored 💯 today 🤯pic.twitter.com/Aqj5EnM3Ay
— Richard Kettleborough (@RichKettle07) December 24, 2025