లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ నుంచి అనూహ్య నిష్క్రమణ తర్వాత రానున్న న్యూజిలాండ్ సిరీస్కు పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్లు దూరమయ్యే అవకాశం కనిపిస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్..సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో కనీసం ఒక్క మ్యాచ్ గెలువకుండానే వైదొలిగింది.
ఈ నేపథ్యంలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరిగే కివీస్ పర్యటనలో పాక్ ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. అయితే వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్న సీనియర్లు బాబర్ ఆజమ్, షాహిన్షా ఆఫ్రిదీ, రవూఫ్, నసీమ్షా..కివీస్ పర్యటనకు దూరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగే ఆసియాకప్తో పాటు 2027లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే యువ క్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు పీసీబీ ప్రయత్నాలు చేస్తున్నది.