హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3 : హనుమకొండ జేఎన్ఎస్లో 68వ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) బాలికల అండర్-19 బాక్సింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. మంగళవారంతో ముగిసిన టోర్నీలో వరంగల్ బాక్సర్లు సత్తాచాటారు.
45 కేజీల విభాగంలో నిఖిత(రంగారెడ్డి, స్వర్ణం), కావ్య(వరంగల్, రజతం), 45-48 కేజీల విభాగంలో కార్తీక(వరంగల్, స్వర్ణం), సంజన(ఖమ్మం, రజతం), 48-51 కేజీల విభాగంలో శ్రీలేఖ(మహబూబ్నగర్, స్వర్ణం), అనూష(హైదరాబాద్, రజతం), 57-60 కేజీల విభాగంలో నవ్య(వరంగల్, స్వర్ణం), సుభంగి సవేర్(హైదరాబాద్, రజతం), 60-64 కేజీల విభాగంలో ఖైతీజా బేగం(హైదరాబాద్, స్వర్ణం), లక్ష్మీప్రసన్న(వరంగల్, రజతం) పతకాలు సాధించారు. మొదటి రోజు బాలికల అండర్-17 పోటీలు జరుగగా, రెండో రోజు అండర్-19 బాలికలు తలపడ్డారు. ఈ టోర్నీలో ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 150 మంది ప్లేయర్లు పాల్గొన్నట్లు రాష్ట్ర బాక్సింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్థసారథి పేర్కొన్నారు.