హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈ ఏడాది డిసెంబర్లో కోయంబత్తూరు, బెంగళూరు వేదికలుగా జరుగబోయే 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ కోసం హైదరాబాద్లో నిర్వహించిన సెలక్షన్స్లో రాష్ట్రంలోని బాలబాలికలు సత్తా చాటారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ కమ్ సెలక్షన్ పోటీలు జరిగాయి. రోలర్ ఫ్రీస్టయిల్ బాలికల విభాగంలో రాధె లోయతో పాటు సుహాని, నిషిత, జాన్వి, మోక్షిత్ రామ్, అన్ష్ అసవ ఎంపికయ్యారు. స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో సాన్వి, షౌని, దియా, రోహిత్, హర్షిత్.. ఇన్లైన్ ఫ్రీస్టయిల్ ఈవెంట్లో శ్రీయ, సాయి సనీష్, యశస్విని, దీషిక, అరవ్ చోటు దక్కించుకున్నారు.