Rishabh Pant | పంత్ చాలా లావున్నాడు.. అసలు అతడికి ఫిట్నెస్ టెస్ట్ చేశారా..? పాక్ మాజీ స్పిన్నర్ కామెంట్స్
టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్ పంత్ పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఉండాల్సిన దానికంటే అధిక బరువున్నాడని.. అందుకే వికెట్ల వెనుక చురుకుగా కదల్లేకపోతున్నాడని వ్యాఖ్యానించాడు. అసలు అతడు వంద శాతం ఫిట్ గా ఉన్నాడనేది తనకు అనుమానంగా ఉందని అన్నాడు.
భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడనున్న నేపథ్యంలో కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ.. ‘నేను రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ గురించి మాట్లాడదామనుకుంటున్నాను. పంత్ కీపింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ వేస్తే చురుకుగా కదలలేకపోతున్నాడు. చూస్తుంటే అతడు లావుగా ఉన్నాడని తెలుస్తున్నది. అందుకే అతడు త్వరగా స్పందించలేకపోతున్నాడు..
అసలు రిషభ్ వంద శాతం ఫిట్ గా ఉన్నాడా..? అనిపిస్తున్నది. అయితే కెప్టెన్సీ విషయానికొస్తే అతడికి జట్టులో సీనియర్లుగా ఉన్న దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యాలు సహకరిస్తున్నారు. సౌతాఫ్రికాపై తొలి టీ20 సిరీస్ గెలిచే అవకాశం పంత్ కు వచ్చింది..’ అని అన్నాడు.
అంతేగాక రాజ్‌కోట్ మ్యాచ్ లో రాణించిన టీమిండియా వెటరన్ దినేశ్ కార్తీక్, హర్ధిక్ పాండ్యాపై కనేరియా ప్రశంసలు కురిపించాడు. కార్తీక్ పరిణితితో కూడిన బ్యాటింగ్ చేశాడని.. అతడికి హార్ధిక్ పాండ్యా సహకరించడం ఇండియాకు కలిసొచ్చిందని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

