హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలో జరిగే ప్రతిష్టాత్మక ఇంటర్ క్లబ్ టీ20 టోర్నమెంట్ను సికింద్రబాద్ క్లబ్ గెలుచుకుంది. ఫతే మైదాన్తో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో నెగ్గి పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఫతే మైదాన్ క్లబ్ 20 ఓవర్లలో 160/8 స్కోరు చేయగా లక్ష్యాన్ని సికింద్రబాద్ 14.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది.
చరణ్ (84), సంజీవ్ రెడ్డి (57)తో పాటు బౌలర్ అక్షత్ (3/22) సికింద్రబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు.