ముంబై : న్యూజిలాండ్తో వాంఖడే స్టేడియంలో ఇవాళ ప్రారంభం కావాల్సిన రెండవ టెస్టు ఆలస్యం అవుతోంది. వర్షం కారణంగా పిచ్ చిత్తడిగా మారింది. దీంతో టాస్ ఆలస్యం చేశారు. ఇవాళ 11.30 నిమిషాలకు టాస్ వేయనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఏకంగా రెండు సెషన్లు ఉంటాయి. 78 ఓవర్లు బౌల్ చేయనున్నారు. తొలి సెషన్ 12 నుంచి 2.40 వరకు, ఆ తర్వాత 20 నిమిషాలు టీ బ్రేక్ ఉంటుంది. ఇక సెకండ్ సెషన్ 3 నుంచి 5.30 వరకు జరగనున్నది. రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇశాంత్లు తప్పుకున్నారు. గాయాలు కావడంతో వారికి రెస్ట్ ఇచ్చారు. ఇన న్యూజిలాండ్ జట్టుకు కూడా కెప్టెన్ విలియమ్సన్ దూరం అయ్యాడు. అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు.
Early Lunch has been taken
— BCCI (@BCCI) December 3, 2021
Session 2: 12 Noon to 14:40
Tea Time at 14:40 PM to 15:00
Final session: 15:00 PM to 17:30 #INDvNZ @Paytm https://t.co/ZIbYy27IJU