నాటింగ్‌హామ్: టాపార్డర్ తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. డారిల్ మిషెల్ (81 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ బ్లండెల్ (67బ్యాటింగ్; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా.. విల్ యాంగ్ (47), కాన్వే (46), హెన్రీ నికోల్స్ (30), కెప్టెన్ టామ్ లాథమ్ (26) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
విలియమ్సన్కు కరోనా
న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు కరోనా సోకింది. శుక్రవారం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో విలియమ్సన్కు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడి స్థానంలో టామ్ లాథమ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.