టీ20 ప్రపంచకప్లో మరో సంచలన విజయం నమోదైంది. రెండుసార్లు ఈ ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టుపై పసికూన స్కాట్లాండ్ విజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టు తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి చివరకు ఓటమిపాలైంది.\
స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. విండీస్ ఓపెనర్లు కైల్ మేయర్స్ (20), ఎవిన్ లూయిస్ (14), బ్రాండన్ కింగ్ (17) పెద్దగా ఆకట్టుకోలేదు. వీరే కాదు కెప్టెన్ నికోలస్ పూరన్ (5), షామ్రా బ్రూక్స్ (4), రావ్మెన్ పావెల్ (5), అకీల్ హొస్సేన్ (1), అల్జారీ జోసెఫ్ (0), ఒడియన్ స్మిత్ (5), ఓబెడ్ మెకాయ్ (2 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు.
విండీస్ జట్టులో కేవలం జేసన్ హోల్డర్ (38) మాత్రమే కొద్దోగొప్పో పోరాట పటిమ చూపాడు. దీంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే 118 పరుగులకు ఆలౌట్ అయింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వ్యాట్ 3 వికెట్లతో సత్తాచాటగా.. బ్రాడ్ వీల్, మైకేల్ లీస్క్ చెరో రెండు, జోష్ డేవీ, సఫయాన్ షరీఫ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Phenomenal performance from the Scotts!
Scorecard: https://t.co/AL20Q2qvfv#T20WorldCup | #WIvSCO pic.twitter.com/70qHN82b10— CricketTimes.com (@CricketTimesHQ) October 17, 2022