GGW vs RCBW : వడోదరలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. భారీ ఛేదనకు దిగిన గుజరాత్‌కు షాకిస్తూ ఓపెనర్ బేత్ మూనీ(3)ని బౌల్డ్ చేసిన సయాలీ సత్కరే(2-16).. ఐదో బంతికి సోఫీ డెవినె(0)ను వెనక్కి పంపింది. ఆ తర్వాతి ఓవర్లో కనికా ఆహుజా(0)ను లారెన్ బెల్ డకౌట్‌గా పెవిలియన్ పంపింది. దాంతో.. 5 పరుగులకే గుజరాత్ మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ అష్లీ గార్డ్నర్(6 నాటౌట్), అనుష్క శర్మ(17 నాటౌట్)లు జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. పవర్ ప్లేలో గుజరాత్ స్కోర్.. 29-3.
డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ బౌలర్లు పవర్ ప్లేలో హవా కొనసాగిస్తున్నారు. నవీ ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్‌ను కూల్చిన సయాలీ సత్కరే ఈసారి గుజరాత్ జెయింట్స్ భరతం పడుతోంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఈ పేసర్ డేంజరస్ బేత్ మూనీ(3) సోఫీ డెవినె(0)ను ఔట్ చేసి బెంగళూరుకు అదిరిపోయే బ్రేకిచ్చింది.
Double-wicket 1⃣st over v #DC ✅
Double-wicket 1⃣st over tonight 🔥Sayali Satghare is making it a habit 👏
Updates ▶️ https://t.co/KAjH515c64 #TATAWPL | #KhelEmotionKa | #GGvRCB | @RCBTweets pic.twitter.com/37C0C4wM35
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026
లారెన్ బెల్ తన ఫామ్ కొనసాగిస్తూ.. కనికా ఆహుజాను బౌల్డ్ చేసి ప్రత్యర్థిని మరింత కష్టాల్లోకి నెట్టింది. 5 పరుగులకే మూడు వికెట్లు పడినా అనుష్క శర్మ(17 నాటౌట్) బౌండరీలతో దూకుడు కనబరుస్తోంది. ఆమెకు అండగా సారథి అష్లీ గార్డ్నర్(6 నాటౌట్) జట్టును గెలిపించాలనుకుంటోంది.