బెంగళూరు: విజయ్ హజారే వన్డేలో టోర్నీలో సౌరాష్ట్ర ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో(63 బంతులు మిగిలుండగానే) ఘన విజ యం సాధించింది. ఆదివారం విదర్భ, సౌరాష్ట్ర మధ్య ఫైనల్ జరుగనుంది.
పంజాబ్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 39.3 ఓవర్లలో 293/1 స్కోరు చేసింది. ఓపెనర్ విశ్వరాజ్ జడేజా(127 బంతుల్లో 165 నాటౌట్, 18ఫోర్లు, 3సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. విశ్వరాజ్కు తోడు హర్విక్ దేశాయ్(64), ప్రేరక్ మన్కడ్(52 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. తొలుత చేతన్ సకారియా(4/60) ధాటికి పంజాబ్ 50 ఓవర్లలో 291 ఆలౌటైంది. అన్మోల్ప్రీత్సింగ్(100) సెంచరీ ప్రదర్శన వృథా అయ్యింది.