సిడ్నీ : ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం నుంచి మొదలుకాబోయే ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో అయినా ఆ ముచ్చటను తీర్చుకోవాలని ఈ జోడీ బరిలోకి దిగుతున్నది.
ఏడాదికాలంగా భారత ద్వయం నిలకడగా రాణిస్తున్నా తుది మెట్టుపై తడబడుతూ టైటిల్ దక్కించుకోలేకపోతున్నది. హాంకాంగ్, చైనా మాస్టర్స్‌లో ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.