బీజింగ్ : చైనా సూపర్ ఓపెన్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-18, 21-14తో మలేషియా జంట యుసిన్, తియోయిపై అలవోక విజయం సాధించింది.
నలభై నిమిషాల్లోనే ముగిసిన పోరులో సాత్విక్, చిరాగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఉన్నతి హుడా 16-21, 12-21తో జపాన్ స్టార్ షట్టర్ అకానె యమగుచి చేతిలో ఓటమిపాలైంది.