హాంగ్జో (చైనా) : భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి హాంగ్జో వేదికగా ప్రారంభం కాబోయే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ఈ జోడీ కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా ఉన్న గ్రూప్-బీలో సాత్విక్, చిరాగ్..
లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చెంగ్ (చైనా), ఫజర్ అల్ఫియాన్-మహ్మద్ షోహిబుల్ ఫిక్రి (ఇండోనేషియా), ఆరోన్ చియా-సో వూ యిక్ (మలేషియా)తో తలపడాల్సి ఉంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్-8లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఈ టోర్నీ ఆడేందుకు అర్హులు కాగా భారత్ నుంచి సాత్విక్ ద్వయం (టాప్-3) మాత్రమే క్వాలిఫై అయింది.