India Open: ఇటీవలే కేంద్ర ప్రకటించిన క్రీడా అవార్డులలో ప్రతిష్టాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డు అందుకున్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిల జోడీకి ఇండియా ఓపెన్‌లో నిరాశ తప్పలేదు. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో ఈ జోడీ.. 21-15, 11-21, 18-21 తేడాతో సౌత్ కొరియాకు చెందిన మిన్ హ్యూక్ – సియో సియుంగ్ జే ల చేతిలో ఓడింది. ఇటీవలే మలేషియా ఓపెన్ ఫైనల్లోనూ తుది పోరులో తడబడిన భారత జోడీ.. తాజాగా ఇండియా ఓపెన్‌లోనూ నిరాశ తప్పలేదు.
న్యూఢిల్లీ వేదికగా ఆదివారం ముగిసిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ – చిరాగ్‌లు తొలి సెట్‌ను గెలుచుకున్నారు. కానీ దక్షిణ కొరియా జోడీ రెండో రౌండ్లో అనూహ్యంగా పుంజుకుని సెట్‌ను సొంతం చేసుకుంది. మిన్ – సియోల దూకుడు ముందు భారత ద్వయం తేలిపోయింది. ఇక మూడో రౌండ్లో మన షట్లర్లు పోరాడినా మూడు పాయింట్ల తేడాతో సౌత్ కొరియా జంటనే సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
Satchi in their last 3 tournaments:
India Open: Super 750: Lost in FINAL to reigning World Champions.
Malaysia Open: Super 1000: Lost in FINAL to WR 1 pair.
China Masters: Super 750: Lost in FINAL to WR 1 pair.PS: All the 3 FINALS went to 3 games! #IndiaOpenSuper750 https://t.co/SmeHn4iz68 pic.twitter.com/BS76SvPEPT
— India_AllSports (@India_AllSports) January 21, 2024
పురుషుల టైటిల్ చైనాదే..
పురుషుల సింగిల్స్‌లో చైనా ప్లేయర్ షి యుకి.. 23-21, 21-17 తేడాతో లి చెక్ యూ (హాంకాంగ్)ను చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో చైనీస్ తైఫీకి చెందిన తై జూ యింగ్ టైటిల్ దక్కించుకుంది. తుదిపోరులో ఆమె.. 21-16, 21-12 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీని ఓడించింది. మహిళల డబుల్స్‌లో జపాన్ ద్వయం మత్సుమొటొ – నగహర.. 21-12, 21-13 తేడాతో ఝంగ్ షుగ్జియన్ – జెంగ్ యు (చైనా)లను ఓడించి విజేతగా నిలిచింది.
Tai Tzu Ying and Olympic champion Chen Yu Fei grace the court.#BWFWorldTour #IndiaOpen2024 pic.twitter.com/NGSPlkjBkf
— BWF (@bwfmedia) January 21, 2024