China Masters : ఈ సీజన్లో చెలరేగిపోతున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం చైనా మాస్టర్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అరోన్ చియా, సోహ్ వూయీ యిక్ (మలేషియా) జంటను ఓడించి టైటిల్ వేటకు సిద్దమైంది. ఆద్యంతం దూకడుగా ఆడిన సాత్విక్ – చిరాగ్ 41 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించారు. రెండు సెట్లలోనూ ప్రత్యర్థిని వణికిస్తూ 21-17, 21-14తో గెలుపొందారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అరోన్, సోహ్ జోడీ చేతిలోనే సాత్విక్ సాయిరాజ్ ఓడిపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సింగపూర్ ఓపెన్, చైనా ఓపెన్‌లోనూ భారత జంటకు చెక్ పెట్టిందీ మలేషియా ద్వయం. అయితే.. ఆగస్టు నెల నుంచి సాత్విక్ చిరాగ్ లయ అందుకోవడంతో ప్రత్యర్థులకు పరాజయం తప్పడం లేదు. ఈ సీజన్లో ఏడు టోర్నమెంట్లో సెమీ ఫైనల్ చేరిన ఈ జోడీ .. రెండు దఫాలు ఫైనల్ ఆడింది.
Are Satwik-Chirag the best badminton players in India right now? 🇮🇳 🤔
➡️ Read more on how Sat-Chi defeated their nemesis, Aaron Chia-Soh Wooi Yik, to reach the China Masters 750 final: https://t.co/KbPcgaVnug pic.twitter.com/005I1hdTSy
— ESPN India (@ESPNIndia) September 20, 2025
ఈమధ్యే వరల్డ్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లో అరోన్, సోహ్లను మట్టికరిపించారు సాత్విక్ చిరాగ్. ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 కిమ్ వోన్, సియో సుంగ్ జేతో భారత డబుల్స్ స్టార్లు తలపడనున్నారు. ఇటీవలే మలేషియా ఓపెన్‌లో ఈ ద్వయం చేతిలో చిరాగ్ జంట వరుస సెట్లలో ఓడిపోయింది. మరి.. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.