Pakistan | పారిస్ ఒలింపిక్స్లో పోటీకి దిగిన పాకిస్థాన్ జట్టుపై జోకులు పేలుతున్నాయి. 24 కోట్ల జనాభా నుంచి బరిలో ఉన్నది ఏడుగురు అథ్లెట్లు అంటూ పలువురు సోషల్మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. విశ్వక్రీడల కోసం పాకిస్థాన్ 18 మందితో కూడిన బృందాన్ని పారిస్కు పంపగా,అందులో ఏడుగురు ప్లేయర్లు కాగా మిగతా వారు అధికారులు కావడం విశేషం.
శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వ్యాఖ్యాత వ్యంగ్యంగా మాట్లాడుతూ ‘24 కోట్ల జనాభా కల్గిన పాకిస్థాన్ నుంచి ఏడుగురు అథ్లెట్లు మాత్రమే పాల్గొంటున్నారు’ అని దెప్పిపొడిచాడు. ఈ వీడియోను పాక్ జర్నలిస్టులు సోషల్మీడియాలో షేర్ చేశారు.