న్యూఢిల్లీ: భారత మహిళల చీఫ్ కోచ్గా సాంటియాగో నివా ఎంపికయ్యాడు. గతంలో జాతీ య బాక్సింగ్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా వ్యవహరించిన సాంటియాగో ఇక నుంచి మహిళా బాక్సర్లకు కోచ్గా సేవలందించనున్నాడు.
ఈ విషయాన్ని బీఎఫ్ఐశుక్రవారం ప్రకటనలో పేర్కొంది. 2017-22 వరకు భారత్కు హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా సాంటియాగో అద్భుత ఫలితాలు అందించాడు. భారత బాక్సర్లతో తిరిగి మమేకం కావడం సంతోషంగా ఉందని సాంటియాగో తెలిపాడు.