ముంబై: రాబోయే ఐపీఎల్(TATA IPL 2026)లో ఆటగాళ్ల మార్పులు భారీగా జరుగుతున్నాయి. ప్లేయర్స్ ట్రేడింగ్ జరిగినట్లు ఐపీఎల్ ప్రకటించింది. 2026 సీజన్‌కు చెందిన ప్లేయర్ రిటెన్షన్ ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్లను మార్చేస్తున్నాయి.
గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా చేసిన సంజూ శాంసన్ వచ్చే సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనున్నాడు. ప్రస్తుతం ఉన్న 18 కోట్ల ధరకే అతను జట్టు మారాడు. ఐపీఎల్లో సుమారు 177 మ్యాచ్‌లు ఆడాడు సంజూ. 2013లో అతను ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2016, 2017 సీజన్లలో మాత్రం అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాబోయే సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. సీఎస్కేకు 12 సీటన్లు ఆడిన అతను.. ఐపీఎల్లో దాదాపు 250 మ్యాచ్‌లు ఆడాడు. అగ్రిమెంట్లో భాగంగా అతని ఫీజును 18 కోట్ల నుంచి 14 కోట్లకు తగ్గించారు. చెన్నై ప్లేయర్ సామ్ కర్రన్ కూడా వచ్చే సీజన్ నుంచి ఆర్ఆర్కు ఆడనున్నాడు.
🚨 NEWS 🚨#TATAIPL 2026 – Player Trade updates
🧵 A look at all the trades ahead of today’s retention deadline 🙌
Details of all trades ▶️ https://t.co/wLTQBlcame pic.twitter.com/OfmEpSM4Bi
— IndianPremierLeague (@IPL) November 15, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫాస్ట్ బౌలర్ షమీ వీడనున్నాడు. అతను వచ్చే సీజన్ నుంచి లక్నో సూపర్ గెయింట్స్‌కు ఆడుతాడు. 10 కోట్ల ఫీజుకే అతను ఫ్రాంచైజీ మారుతున్నాడు. 2024 సీజన్లో గాయనం వల్ల అతను ఆడలేదు. కానీ 2023లో 28 వికెట్ల తీసి పర్పుల్ క్యాప్ కొట్టేశాడు.
లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. కోల్‌కతా జట్టు నుంచి అతను రిలీవ్ అయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టను వీడాడు. వచ్చే సీజన్లో అతను లక్నో తరపున ఆడనున్నాడు. ప్రస్తుతం ఉన్న 30 లక్షల ఫీజుకే అతను జట్టును మారాడు. బ్యాటర్ నితీశ్ రాణా వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నాడు.