ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా గురువారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. యంగ్ కెప్టెన్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్‌ల నాయకత్వంలోని జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ ఘన విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్‌తో ఉత్కంఠ పోరులో శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. లీగ్‌లో బోణీ చేయాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది.
టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బెన్‌స్టోక్స్ స్థానంలో డేవిడ్ మిల్లర్‌ను, గోపాల్ స్థానంలో ఉనద్కత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు శాంసన్ తెలిపాడు. మరోవైపు ఢిల్లీ టీమ్‌లోకి హెట్‌మైర్ స్థానంలో రబాడ రాగా… లలిత్ యాదవ్ అరంగేట్రం చేస్తున్నాడు.
Toss Update: Captain @IamSanjuSamson gets it right and says that @rajasthanroyals will bowl first against @DelhiCapitals in Match 7 of #VIVOIPL. Both have made 2 changes to their XI.
— IndianPremierLeague (@IPL) April 15, 2021
Follow the game – https://t.co/SClUCyADm2 #RRvDC pic.twitter.com/wx4gcvS0FF
A proud moment for @LalitYadav03 today as he makes his @DelhiCapitals debut and gets his🧢 from @RickyPonting! 👏🏾https://t.co/SClUCyADm2 #RRvDC #VIVOIPL pic.twitter.com/OGF4FnhqMP
— IndianPremierLeague (@IPL) April 15, 2021