దుబాయ్: భారత టెన్నిస్ క్వీన్ సానియామీర్జా తన కెరీర్‌ను త్వరలో వీడ్కోలు పలుకనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన టోర్నీలు ఆడుతున్న ఈ టెన్నిస్ దిగ్గజం ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ ఆఖరిదని ప్రకటించింది. డబ్యూటీఏ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నా ఆలోచనలకు అనుగుణంగా ముందుకుసాగుతాను. గాయం కారణంగా వైదొలుగాల్సి అవసరం లేకుండా చూసుకుంటాను. అందుకే పూర్తి ఫిట్నెస్ కోసం ప్రస్తుతం శిక్షణలో ఉన్నాను’ అని వెబ్‌సైట్‌కు తెలిపింది. డబుల్స్ మాజీ ప్రపంచ నంబర్‌వన్ అయిన హైదరాబాదీ సానియా మీర్జా వాస్తవానికి గతేడాది ఆఖర్లోనే కెరీర్‌కు వీడ్కోలు పలుకాలని అనుకుంది. కానీ మోచేయి గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగాల్సి వచ్చింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్న సానియా..డబ్ల్యూటీఏ టోర్నీ ద్వారా సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది.