Sanath Jayasuriya | కొలంబో: త్వరలో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక.. ఈ సిరీస్‌లో తమ జాతీయ జట్టుకు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యను నియమించింది. ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో లంక గ్రూప్ దశకే పరిమితమవడంతో ఆ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉన్న క్రిస్ సిల్వర్‌వుడ్ తన బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జట్టుకు పూర్తిస్థాయి కోచ్‌ను నియమించేదాకా జయసూర్య ఆ బాధ్యతలు మోస్తాడని శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 27 నుంచి శ్రీలంక.. భారత్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.