Sanju Samson : ఆసియా కప్ స్క్వాడ్‌లో ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson) సెంచరీతో చెలరేగాడు. మెగా టోర్నీకి ముందు తన విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో చాటుతూ శతక గర్జన చేశాడీ హిట్టర్. కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League) మ్యాచ్‌లో వీరకొట్టుడు కొట్టిన సంజూ కేవలం 42 బంతుల్లోనే వందకు చేరువయ్యాడు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వేదికగా జరుగబోయే ఆసియా కప్ (Asia Cup 2025)లో ఓపెనర్‌గా ఆడేందుకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చాడీ హిట్టర్. అతడి విధ్వంసంతో 237 పరుగుల లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది.
పొట్టి ఫార్మాట్ అంటే చాలు శివాలెత్తిపోయే సంజూ శాంసన్ మరోసారి తన తడాఖా చూపించాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో అరీస్ కొల్లాం సెయిలర్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో మెరిశాడు. బౌండరీలతో విరుచుకుపడిన సంజూ కేవలం 42 బంతుల్లోనే మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ డాషింగ్ బ్యాటర్ 51 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో విజృంభించాడు.
A 🅃🄾🄽 of Power 🤩
Sanju Samson, that was ruthless. 🔥#KCLSeason2 #KCL2025 pic.twitter.com/pKDx75vF5R
— Kerala Cricket League (@KCL_t20) August 24, 2025
శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో కొచ్చి బ్లూ టైగర్స్ భారీ లక్ష్యాన్ని అలవోకగా కరిగించింది. తనదైన మార్క్ షాట్లతో అలరించిన సంజూ ఆసియా కప్‌లో ఓపెనర్‌గా మరింత రెచ్చిపోతానని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్న అతడిపై కోచ్, కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఆసియా కప్ స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.