BCCI : ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్‌తో మేల్కొన్న భారత సెలెక్టర్లు టీ20 స్క్వాడ్‌లో భారీ మార్పులు చేశారు. జింబాబ్వే పర్యటనకు పలువురిని పక్కనపెట్టి.. ఐపీఎల్లో, దేశవాళీ క్రికెట్లో రాణించిన వాళ్లను ఎంపిక చేశారు. ఓపెనర్‌గా విఫలమవుతున్న సంజూ శాంసన్(Sanju Samson)పై వేటు వేస్తూ.. వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)లను తీసుకున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం సోమవారం శ్రేయాస్ అయ్యర్ సారథిగా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది.
జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్‌లో కీలక మార్పులు చేశారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన వారిలో సగం మందిని తప్పించి కొత్త వాళ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఐర్లాండ్‌పై తేలిపోయిన ఓపెనర్ సంజూ శాంనన్పై వేటు పడగా.. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కింది.
🚨 News 🚨#TeamIndia squad announced for the 3️⃣-match T20I series against Zimbabwe.
More Details ▶️ https://t.co/sC19D5eW8y#ZIMvIND pic.twitter.com/ctbM5gFMtY
— BCCI (@BCCI) July 6, 2026
ఇషాన్ కిషన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఎంపికవ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా సూర్యాన్ష్ షెడ్గే, ఫినిషర్‌గా రింకూ సింగ్‌ను తీసుకున్నారు. ఐపీఎల్- 19వ సీజన్లో మెరిసి ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, హర్ష్ దూబే, మయాంక్ యాదవ్‌లో బౌలింగ్ దళంలో చోటు దక్కించుకున్నారు. భారత్, జింబాబ్వే మధ్య జూలై 23 నుంచి హరారేలో మూడు టీ20ల సిరీస్ మొదలవ్వనుంది.
భారత స్క్వాడ్ : శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.