Sama Angels |హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(హెచ్పీజీఎల్)లో సమా ఏంజెల్స్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో సమా ఎంజెల్స్ 175 పాయింట్లతో ఆకట్టుకుంది.
గ్రూపు-ఏ నుంచి సమా ఏంజెల్స్(804), కేష్మ(698) క్వార్టర్స్లోకి ప్రవేశించగా, మిగతా గ్రూపుల నుంచి అల్ఫా, రఫ్రైడర్స్, డీఎస్ఆర్, టూటోరూట్, విల్లాజియో, మీనాక్షి తదుపరి రౌండ్లో నిలిచాయి.