ECB : సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్ (England) టీ20 సిరీస్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో సఫారీలకు చెక్ పెట్టాలనుకుంటోంది ఆతిథ్య జట్టు. అందుకే.. మ్యాచ్ విన్నర్ అయిన సామ్ కరన్ (Sam Curran)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోల్పోయిన కరన్.. ఈమధ్యే ‘ది హండ్రెడ్ లీగ్’లో గొప్పగా రాణించడంతో ఎంపిక చేశారు. అయితే.. ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమైన ఓపెనర్ బెన్ డకెట్‌ను పక్కన పెట్టేశారు.
దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌కు హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది ఇంగ్లండ్ బోర్డు. ఇందులో జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ వంటి సీనియర్లు ఉండగా.. బెన్ డకెట్‌కు మాత్రం చోటు దక్కలేదు. త్వరలోనే న్యూజిలండ్ పర్యటన, యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని అతడికి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు టీ20 సిరీస్ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12న రెండో మ్యాచ్, సెప్టెంబర్ 14న మూడో మ్యాచ్ జరుగనున్నాయి. ఐర్లాండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు జాకబ్ బెథెల్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
Sam Curran has been added to the England squad for their IT20 series against South Africa, while Ben Duckett will be rested 🏴🔄 pic.twitter.com/HX2IFtrY6p
— Sky Sports Cricket (@SkyCricket) September 5, 2025
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం : హ్యారీ బ్రూక్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రాండన్ కార్సే, సామ్ కరన్, లియాం డాసన్, విల్ జాక్స్, సకీబ్ మహమ్మద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్.
ఐర్లాండ్ సిరీస్ కోసం : జాకబ్ బెథెల్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియాం డాసన్, విల్ జాక్స్, సకీబ్ మహ్మూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్, జోర్డాన్ కాక్స్, సోని బేకర్, టామ్ హర్ట్లే.
Sam Curran is having a season to remember in The Hundred 💪#SamCurran #Cricket pic.twitter.com/C4cuSlVtlY
— Wisden (@WisdenCricket) August 26, 2025