IPL 2025 : టాపార్డర్ విఫలమైనా సన్‌రైజర్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన ఇషాన్ కిషన్(44) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అతడు ఆ తర్వాత పెద్ద షాట్ ఆడాడు. అయితే.. బౌండరీ లైన్ వద్ద సామ్ కరన్ వెనక్కి పడుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 90వద్ద నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం అనికేత్ వర్మ(19), కమిందు మెండిస్(0)లు క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 94-4.
స్వల్ప ఛేదనలో సన్‌రైజర్స్‌కు సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ పెద్ద షాకిచ్చాడు. రెండో బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ(0)ను ఔట్ చేశాడు. అభి ఆడిన బంతిని అన్షుల్ కంబోజ్ సులువుగా అందుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ జతగా హెడ్ ధాటిగా ఆడాడు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగారు. అయితే.. పవర్ ప్లే ముగుస్తుందనగా బౌల్డ్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్(7) జడేజా బౌలింగ్‌లో హుడా చేతికి దొరికాడు. అంతే.. 3 వికెట్లు పడ్డాయి. అనికేత్ వర్మ(19).. సామ్ కరణ్ వేసిన 10 ఓవర్లో ఇషాన్ ఫోర్, అనికేత్ సిక్సర్ బాదడంతో స్కోర్ 60 దాటింది. నాలుగో వికెట్‌కు 36 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని నూర్ అహ్మద్ విడదీశాడు.