లండన్: ఇంగ్లండ్ పేస్ ఆల్‌రౌండర్ సామ్ కరన్.. టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరన్.. వెన్ను నొప్పి కారణంగా పొట్టి ప్రపంచకప్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. ‘శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం కరన్ గాయపడినట్లు తెలిపాడు. రెండు రోజుల్లో అతడు ఇంగ్లండ్ చేరుకుంటాడు. పరీక్షల అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తాం’ అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.