IPL 2025 : ఆర్సీబీ విధ్వంసక ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(62 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. విరాట్ కోహ్లీ(42) ఔటయ్యాక జూలు విదిల్చిన అతడు ఈషన్ మలింగ ఓవర్లో ఫోర్ కొట్టి.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. కోహ్లీని హర్ష్ దూబే వెనక్కి పంపిన తర్వాత సాల్ట్ గేర్ మార్చాడు. హర్షల్ పటేల్ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదిన అతడు.. ఆతర్వాత హర్ష్ ఓవర్లో భారీ సిక్సర్ బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు.
అనంతరం మలింగ బౌలింగ్‌లో ఔట్ సైడ్ పడిన బంతిని ఫోర్‌గా మలిచి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బౌలింగ్ చేంజ్ చేసిన కమిన్స్.. నితీశ్‌కు బంతి ఇచ్చి మయాంక్ అగర్వాల్(10) వికెట్ సాధించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. ఆర్సీబీ 11 ఓవర్లలో 2 వికె ట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
ఫిలిప్ సాల్ట్(62 నాటౌట్), కోహ్లీ(42)
భారీ ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు పోటీపడి బౌండరీలు బాదారు. విరాట్ కోహ్లీ(42) అయితే.. రికిన బంతిని దొరికినట్టు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఈషన్ మలింగ వేసిన 6వ ఓవర్లో కోహ్లీ ఒక ఫోర్.. సాల్ట్ ఒక ఫోర్ కొట్టగా స్కోర్ 60 దాటింది. ఆ తర్వాత బంతిని సాల్ట్ స్టాండ్స్‌లోకి పంపాడు దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో 72 రన్స్ కొట్టింది. సన్‌రైజర్స్ కూడా 6 ఓవర్లకు ఇన్నే పరుగులు చేసింది. దంచేస్తున్న కోహ్లీని హర్ష్ దూబే ఔట్ చేసి కమిన్స్ సేనకు బ్రేకిచ్చాడు.
A 𝐒𝐰𝐞𝐞𝐭 5⃣0⃣ from 𝐒𝐚𝐥𝐭 ❤
Phil Salt leads #RCB‘s mammoth run chase with his 3rd half-century of the season! 🫡
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/gfhYF5SQdz
— IndianPremierLeague (@IPL) May 23, 2025