IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సొంతగడ్డపై చతికిలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జైపూర్‌లో అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో విజృంభించిన బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)పై జయభేరి మోగించింది. 174 పరుగుల ఛేదనలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(65) విధ్వంసక ఆర్ధ శతకంతో మెరిశాడు. సాల్ట్ మెరుపులతో విజయానికి పునాది వేయగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(62 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(40 నాటౌట్) సైతం దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు కోహ్లీతో అబేధ్యమైన 83 రన్స్ జోడించాడు. దాంతో, ఆర్సీబీ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటింది. జైపూర్ వేదికగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయ గర్జన చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(65) తనదైన స్టయిల్లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ(62 నాటౌట్) సైతం బౌండరీలతో చెలరేగాడు. సందీప్ శర్మ వేసిన 4వ ఓవర్లో కోహ్లీ గాల్లోకి లేపిన బంతిని అందుకున్న రియాన్ పరాగ్ ఒడిసిపట్టుకోలేక వదిలేశాడు. ఆ కాసేపటికే సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సందీప్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న ఈ ఇద్దరు ఆ తర్వాత మరింత వేగంగా ఆడారు. దాంతో, పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 65 రన్స్ చేసింది.
Kohli gets to his 5⃣0⃣ in 𝗥𝗢𝗬𝗔𝗟 style! 👑
🎥 Watch Virat Kohli light up the chase with his classic fireworks! 🔥
Updates ▶ https://t.co/rqkY49M8lt#TATAIPL | #RRvRCB | @RCBTweets | @imVkohli pic.twitter.com/8lNUHmUCKx
— IndianPremierLeague (@IPL) April 13, 2025
లైఫ్ లభించడంతో రెచ్చిపోయిన సాల్ట్.. సందీప్ వేసిన 6వ ఓవర్లో సిక్సర్ బాదాడు. 7వ ఓవర్లో బౌండరీతో అర్ధ శతకం సాధించిన సాల్ట్ ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు. అయితే.. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడి యశస్వీ చేతికి చిక్కాడు. దాంతో, 92 వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(40 నాఔటట్) బౌండరీలతో చెలరేగాడు. సందీప్ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టిన పడిక్కల్ జట్టుకు 9 వికెట్ల విజయాన్ని అందించాడు. నాలుగో విక్టరీతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా మొదలైంది. పవర్ ప్లేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో, రాజస్థాన్ ఓపెనర్లు సంజూ శాంసన్(15), యశస్వీ జైస్వాల్(75 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ధాటిగా ఆడలేకపోయారు. ఓవర్‌కు ఒక బౌండరీ చొప్పున సాధించగా.. 45 రన్స్ మాత్రమే వచ్చాయి. అయితే.. ఆ తర్వాత దూకుడు పెంచాలనుకున్న శాసన్ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటవ్వడంతో తొలి వికెట్ 49 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత రియాన్ పరాగ్(30) సహకారంతో యశస్వీ దూకుడుగా ఆడాడు.
WELL PLAYED, YASHASVI JAISWAL 👌
– 75 runs from 47 balls including 10 fours & 2 sixes, He is making huge impact for Rajasthan Royals, Great news for Team India ahead of the T20I World Cup. pic.twitter.com/2USl5Ehpwm
— Johns. (@CricCrazyJohns) April 13, 2025
కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సింగిల్ తీసి యశస్వీ అర్థ శతకం సాధించాడు. రియాన్ పరాగ్(30)తో 55 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించాడు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడడంతో 13 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 104 రన్స్ చేసింది. అయితే.. యశ్ దయాల్ బౌలింగ్‌లో పరాగ్ కవర్స్‌లో విరాట్ కోహ్లీకి సులవైన క్యాచ్ ఇచ్చాడు. అర్ద శతకం తర్వాత జోరు పెంచి ఆడుతున్న యశస్వీని హేజిల్‌వుడ్ ఎల్బీగా ఔట్ చేసి.. రాజస్థాన్ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో ధ్రువ్ జురెల్(35 నాటౌట్), హెట్‌మైర్(9)లు ధాటిగా ఆడారు. 20వ ఓవర్లో ఆఖరి బంతిని నితీశ్ రానా(4 నాటౌట్) బౌండరీ సాధించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 173 పరుగులకే పరిమితమైంది.