Sakshi Dhoni: ముంబై స్టేడియంలో ధగధగలు.. 3 కోట్ల ఖరీదైన వాచ్ ధరించిన సాక్షీ ధోనీ
Sakshi Dhoni: క్రికెటర్ ధోనీ భార్య సాక్షీ ధోనీ .. 3 కోట్ల ఖరీదైన వాచ్‌ను ధరించింది. ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఆమె ఆ వాచ్ పెట్టుకున్నది. రిచర్డ్ మిల్లి కంపెనీ వాచ్ ఆమె చేతికి మెరిసిపోయింది.
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 23వ తేదీన ముంబై స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లను ధోనీ భార్య సాక్షీ ధోనీ(Sakshi Dhoni) వీక్షించింది. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న చాలా కలర్ఫుల్గా కనిపించింది. అయితే ఆ మ్యాచ్‌కు క్యూట్ తయారై వచ్చిన సాక్షీ ధోనీ తన చేతికి ఖరీదైన వాచ్ పెట్టుకున్నది. సుమారు 3 కోట్ల ఖరీదైన రిచర్డ్ మిల్లి వాచ్‌ను ఆమె ధరించినట్లు తెలుస్తోంది. చెన్నై ప్లేయర్లకు చీర్స్ చేస్తున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోకు ఆమె వాచ్ చిక్కింది. ఫ్లోరల్ ప్రింట్స్‌తో ఉన్న క్రీమ్ కలర్ డ్రెస్సులో అందంగా కనిపించిన సాక్షీ ధోనీ.. ఆ మ్యాచ్‌కు రిచర్డ్ మిల్లి వాచ్ పెట్టుకుని వచ్చింది. ఆ వాచ్ ఖరీదు సుమారు 3,34000 డాలర్లు ఉంటుంది. అంటే సుమారు 3.1 కోట్లు అన్నమాట.
రిచర్డ్ మిల్లి ఆర్ఎం 67-02 వేడీ వాన్ నీకెర్క్.. ఓ ఆల్ట్రా లైట్‌వెయిట్ చేతి గడియారం. సౌతాఫ్రికా ఒలింపిక్ మెడలిస్టు రన్నర్ సహకారంతో ఆ వాచ్‌ను రూపొందించారు. మేటీ అథ్లెట్ల కోసం స్విస్ కంపెనీ ఆ వాచ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ తయారీలో చాలా ఇంజనీరింగ్ ఉన్నట్లు తెలిసింది. వాచ్ కేసు సైజు 47.52 x 38.70 x 7.80 ఎంఎం. క్వార్ట్జ్ టీపీటీ తో దీన్ని తయారు చేశారు. ఎల్లో, గ్రీన్ కలర్స్.. దక్షిణాఫ్రికా జాతీయ జెండాను సూచిస్తాయి. లైట్ వెయిట్, షాక్ రెసిస్టాంట్ వాచ్ ఇది. గ్రీన్ కలర్లో అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న ఆ వాచ్.. సాక్షీ ధోనీకి మరింత అందాన్ని తీసుకొచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

