మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 23 : ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ సూపర్ సెలెక్టర్ హ్యాకథాన్ విజేతగా రాష్ర్టానికి చెందిన సాయినాథ్‌రెడ్డి నిలిచాడు. దేశంలో దాదాపు 8వేల మంది ఇందులో పోటీపడగా, ముంబైలో జరిగిన స్క్రీనింగ్ టెస్టులో 16 మంది ఆ తర్వాత ముగ్గురిని ఎంపిక చేశారు.
ఇందులో నుంచి మహబూబాబాద్ పట్టణంలోని సంకెపల్లి కీర్తన-శ్రీనివాస్‌రెడ్డి దంపతుల కొడుకు సాయినాథ్‌రెడ్డి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సాయినాథ్‌రెడ్డి.. బెంగళూరులో డాటా సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు.