హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా 5వ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మగారాల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి.. సికింద్రబాద్ క్లబ్ ఉపాధ్యక్షుడు అశ్విని సింగ్, టిస్కాన్ రెడిబిల్డ్ ప్రతినిధి ఆదిత్య జైన్‌తో కలిసి పోటీలను ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్ వేదికగా జూలై 26 నుంచి 30 వరకూ జరిగే ఈ ప్రతిష్టాత్మక రెగెట్టా వైఏఐ ర్యాంకింగ్ ఈవెంట్లో దేశవ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా యువ సెయిలర్లు పాల్గొంటున్నారు.