గోదావరిఖని, జూన్ 13: నాగపూర్‌లో ఇటీవల జరిగిన కోల్ఇండియా మహిళల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రాష్ర్టానికి చెందిన సాయిలత రజత పతకంతో మెరిసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-1 ఏరియా దవాఖానలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న సాయిలత 84కిలోల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా ఆర్జీ-1 జీఎం చింతల శ్రీనివాస్ గురువారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పురుషులతో సమానంగా మహిళలు జాతీయస్థాయిలో రాణించడం సింగరేణికి గర్వకారణమని కొనియాడారు. ఈ కార్కక్రమంలో ఎస్వోటూ జీఎం రాంమ్మోహన్, ఏజీఎం లక్ష్మీనారాయణ, స్పోర్ట్స్ కార్యదర్శి సారంగపాణి, సూపర్వైజర్ రమేశ్, గాండ్ల రాజయ్య పాల్గొన్నారు.