IPL 2025 : భారీ ఛేదనలో గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు బౌండరీలతో రెచ్చిపోతున్నారు. ఓపెనర్ సాయి సుదర్శన్(74) అర్ధ శతకంతో చెలరేగగా.. జోస్ బట్లర్(38) బౌండరీల మీద బౌండరీలు బాదేస్తున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 13 వ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన సుదర్శన్ బౌండరీ వద్ద శశాంక్ చేతికి చిక్కాడు.
దాంతో గుజరాత్ 145 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన షెర్ఫానే రూథర్‌ఫర్డ్(1).. సహకారంతో జట్టును గెలిపించే పనిలో నిమగ్నమయ్యాడు బట్లర్. 13 ఓవర్లకు స్కోర్.. 152-2.
Hammered x 2️⃣
Sai Sudharsan & Jos Buttler in full flow as #GT race towards a mammoth chase 🔥
Updates ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @gujarat_titans pic.twitter.com/bQPSq8XOiN
— IndianPremierLeague (@IPL) March 25, 2025
మొదట ఆడిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో చెలరేగగా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అయ్యర్ మెరుపులతో డీలా పడిన గుజరాత్ టైటన్స్ బౌలర్లను యువ చిచ్చరపిడుగు శశాంక్ సింగ్(44 నాటౌట్) ఓ ఆట ఆడుకున్నాడు. రబడ, సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 20వ ఓవర్లో ఐదు ఫోర్లతో 23 రన్స్ పిండుకున్న శశాంక్ గుజరాత్‌కు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.