దుబాయ్: పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హన్(Sahibzada Farhan).. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ బ్యాటర్ తన పవర్ఫుల్ స్ట్రోక్స్‌తో కాసేపు అలరించాడు. 45 బంతుల్లోనే అతను 58 రన్స్ చేశాడు. ఆల్‌రౌండర్ శివం దూబే బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. అయితే పాక్ జట్టుకు మంచి ఫౌండేషన్ ఇచ్చిన ఫర్హన్.. హాఫ్ సెంచరీ స్కోరు చేయగానే సంబరాలు జరుపుకున్నాడు. బ్యాట్‌ను రైఫిల్లా ఎక్కిపెట్టి.. ఫైరింగ్ చేస్తూ తన హాఫ్ సెంచరీ ఫీట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏకే47 గన్‌తో ఫైరింగ్ చేస్తున్నట్లు ఎంజాయ్ చేశాడు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. క్రికెట్లో ఫైరింగ్ సెలబ్రేషన్ ఏందని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
రైఫిల్ ఫైరింగ్ సెలబ్రేషన్‌పై కామెంట్ చేశాడు ఫర్హన్. శ్రీలంకతో రేపు సూపర్ 4 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఫర్హన్ పాల్గొన్నాడు. గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ గురించి ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోనన్నాడు. తనకు నచ్చినట్లు సెలబ్రేట్ చేసుకున్నట్లు చెప్పాడు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నాడు. ఒకవేళ మీరు సిక్సర్ల గురించి మాట్లాడితే, భవిష్యత్తులో అలాంటివి ఇంకా చూస్తారన్నాడు. సెల్రబేషన్ మాత్రం ఆ టైంలో అలా జరిగిపోయిందన్నాడు. 50 స్కోర్ చేస్తే సెలబ్రేట్ చేసుకోను అని, కానీ ఆ క్షణంలో తన మెదడులో ఆలోచన వచ్చిందని, అందుకే ఆ ఫైరింగ్ సెలబ్రేషన్ చేసుకున్నట్లు చెప్పాడు. తన సంబరాల గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో చెప్పలేనని, కానీ మిగితా సందర్భాల్లో చాలా దూకుడుగా క్రికెట్ ఆడాలన్నాడు. ఇండియాతో ఆడినప్పుడే కాదు, ప్రతి సందర్భంలోనూ దూకుడుగానే ఆడాలన్నాడు.
ఇటీవల తమ జట్టు పవర్‌ప్లేలో ఎక్కువగా వికెట్లను కోల్పోయిందని, ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్నాడు. మొదటి ఆరు ఓవర్లలోనే వీలైనన్ని పరుగులు చేయాలన్నాడు. పవర్‌ప్లే ఓవర్లను ఉపయోగించుకోవడం లేదని, వికెట్లను చేజార్చుకుంటున్నామన్నాడు.
इनको कौन समझाये ये बैट है AK47 नहीं 😡😡#INDvPAK
— Shivani (@shivani_di) September 21, 2025