హైదరాబాద్, ఆట ప్రతినిధి : షోలాపూర్(మహారాష్ట్ర) వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ 35కే టెన్నిస్ టోర్నీలో తెలంగాణ స్టార్ ప్లేయర్ సహజ యమ్లపల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సహజ 6-3, 6-0తో యశిన ఎక్టరీనా(రష్యా)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కొనసాగించిన సహజ..వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది.