న్యూఢిల్లీ : బెంగళూరులో జూన్ 21నుంచి జులై 4వరకు జరుగనున్న శాప్ కప్ ఫుట్బాల్ టోర్నీలో భారత్, పాక్ తిరిగి తమ వైరాన్ని ఆరంభించనున్నాయి. బుధవారం 14వ శాఫ్ కప్ ఫుట్బాల్ టోర్నీ డ్రాను వెల్లడించారు. గ్రూపు-ఎలో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా, పాకిస్థాన్, కువైట్, నేపాల్ తలపడనుండగా, గ్రూపు-బిలో లెబనాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్ పోటీపడనున్నాయి.
టోర్నీని మరింత రసవత్తరం చేసేందుకు దక్షిణాసియేతర దేశాలైన లెబనాన్, కువైట్లను టోర్నీకి ఆహ్వానించారు.