ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్‌గా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడా బుమ్రా ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు. ‘‘ఇది బుమ్రానా? లేక యువీనా? 2007ను గుర్తొచ్చేసింది’’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో బుమ్రా ఏకంగా 29 పరుగులు చేస్తే.. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యంత భారీగా పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బ్రాడ్ చెత్త రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
Kya yeh Yuvi hai ya Bumrah!?
2007 ki yaad dilaa di.. 😍@YUVSTRONG12 @Jaspritbumrah93 #ENGvIND pic.twitter.com/vv9rvrrO6K
— Sachin Tendulkar (@sachin_rt) July 2, 2022