ఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయంతో మొదలైన పటౌడీ పేరు మార్పు వివాదానికి తెరపడింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్ విజేతలకు ఇచ్చే ట్రోఫీని దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు మీద ఇస్తుండగా తాజాగా ఈసీబీ.. దానిని టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పేరు మార్చిన విషయం విదితమే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
స్వయంగా సచిన్‌తో పాటు ఐసీసీ చైర్మన్ జై షా కూడా పటౌడీ పేరును తొలగించొద్దని కోరడంతో ఈసీబీ దిగొచ్చింది. ఆయన గౌరవాన్ని కాపాడేందుకు గాను టెస్టు సిరీస్ గెలిచిన జట్టు సారథికి ‘పటౌడీ మెడల్’ను ప్రదానం చేయనున్నారు. అయితే ట్రోఫీ పేరును మాత్రం టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగానే ఉంచారు.