Sachin Tendulkar : పద్నాలుగేళ్ల తర్వాత ‘గోట్ ఇండియా టూర్ 2025’లో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (Lionel Messi)కి అపూర్వ స్వాగతం లభిస్తోంది. కోల్‌కతా, హైదరాబాద్ పర్యటన తర్వాత ఆదివారం ముంబై చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వాంఖడే స్టేడియం (Wankhede Stadium) చేరుకున్న ఫుట్‌బాల్ దిగ్గజాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కలిశాడు.
భారత పర్యటనలో ముంబై మహా నగరానికి విచ్చేసిన లియోనల్ మెస్సీ అభిమానులను అలరించేందుకు వాంఖడే చేరుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ దిగ్గజ ఆటగాడిని కలిసి మురిసిపోయాడు. తన పదో నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి కానుకుగా అందించాడు సచిన్. సాకర్ మాంత్రికుడి జెర్సీ నంబర్ కూడా 10 కావడం విశేషం. జెర్సీ బహూకరణ సమయంలో మెస్సీతో ముచ్చటించిన మాస్టర్ బ్లాస్టర్.. మెస్సీ బృందంతో కలిసి ఫొటోలకు ఫొజిచ్చాడు. ఇద్దరూ గోట్ ప్లేయర్లు ఒక్క ఫ్రేమ్‌లో కనిపించడంతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది.
Indian cricket legend Sachin Tendulkar with Leo Messi in Wankhede stadium 🐐 pic.twitter.com/SBMnJPwKwh
— 𝙼𝚛.𝚅𝚒𝚕𝚕𝚊™ (@Shivayaaah) December 14, 2025