న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలున్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్‌తో కలిసి గురువారం ట్రోఫీని ఆవిష్కరించిన సచిన్ సిరీస్‌పై పలు కీలక విషయాలు పంచుకున్నాడు. ‘భారత క్రికెట్ ప్రస్తుతం పరివర్తన దశలో ఉంది. తీసుకునే నిర్ణయాలపై దృష్టి పెడుతూ బయట జరుగుతున్న విషయాలను కొత్త కెప్టెన్ గిల్ మరిచిపోవాలి. భారత కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడి ఉంటుంది.
వీటన్నంటిని తట్టుకుంటూ ముందుకు సాగాలి. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వ్యూహాలు రచించాలే తప్ప..డ్రెస్సింగ్ రూమ్ బయట జరుగుతున్న వాటని పట్టించుకోకూడదు. కెప్టెన్‌గా నిరూపించుకునేందుకు గిల్‌కు సమయం ఇవ్వడంతో పాటు అందరూ మద్దతు ఇవ్వాలి. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా కెప్టెన్ నిర్ణయాలు ఉండాలి. అంతేగానీ ఎవరు పడితే వారు చెప్పినట్లు వింటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని అన్నాడు.