National Cricket League : అగ్రరాజ్యం అమెరికా క్రికెట్లో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా ఇప్పుడు దేశవాళీ లీగ్ (National Cricket League) మీద దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి యువతరంలో స్ఫూర్తి నింపేందుకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) సిద్దమయ్యాడు.
సుదీర్ఘ కెరీర్లో ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిన సచిన్ అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్లో చేరాడు. ఎన్సీఎల్ యాజమాన్యంలో సచిన్ భాగం కానున్నాడు. దిగ్గజ ఆటగాడి రాకతో తమ దేశంలో క్రికెట్కు మహర్ధశ పట్టనుందని అమెరికా బోర్డు భావిస్తోంది. సచిన్ సైతం కొత్త బాధ్యతల్లో ఒదిగిపోయేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు.
From PTI | #SachinTendulkar joins America’s National Cricket League ownership group pic.twitter.com/AywkqyUoKh
— CNBC-TV18 (@CNBCTV18Live) October 6, 2024
‘నా జీవితంలో క్రికెట్ అనేది చాలా గొప్ప ప్రయాణం. నేషనల్ క్రికెట్ లీగ్ ద్వారా అమెరికా క్రికెట్లో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యువతరాన్ని నా ద్వారా ఉత్సాహపరిచి వాళ్లకు వరల్డ్ క్లాస్ క్రికెట్ అలవాటు చేయాలనేది నేషనల్ లీగ్ లక్ష్యం. ఈ కొత్త బాధ్యతను సమర్ధంగా నిర్వహించేందుకు, అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి దోహదం చేసేందుకు నేను ఉత్సంహంగా ఎదురుచూస్తున్నా’ అని సచిన్ వెల్లడించాడు.
Texas Gladiators win by 42 runs! Led by captain Shahid Afridi, they defeated Dallas Lonestars CC in a thrilling contest!
Don’t miss the next match—get your tickets at 👉 https://t.co/7cQnHxgzwo#NCLUSA #ShahidAfridi #TexasGladiators #DallasLonestars #CricketUSA #MatchWin pic.twitter.com/HF92xBzHXD
— National Cricket League (@NCL_Cricket) October 5, 2024
10 ఓవర్ల ఫార్మాట్ అయిన నేషనల్ లీగ్ టోర్నమెంట్ అట్టహాసంగా మొందలైంది. ఈ టోర్నీలో ప్రస్తుతం ఆడుతున్న వాళ్లతో పాటు వీడ్కోలు పలికిన క్రికెటర్లు సైతం తమ మెరుపులతో అభిమానులను అలరించనున్నారు. ఈ సీజన్లో వెటరన్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, వసీం అక్రమ్, వివ్ రిచర్డ్స్, వెంకటేశ్ ప్రసాద్, జహీర్ అబ్బాస్, సనత్ జయసూర్య, మోయిన్ ఖాన్లు కూడా ఆడనున్నారు.