MI vs CSK : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీ బాదాడు. కొయెట్జీ ఓవర్లో సిక్సర్‌తో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. మరోఎండ్‌లో శివం దూబే(27) సైతం ధనాధన్ ఆడుతున్నాడు. దాంతో సీఎస్కే స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. 13 ఓవర్లకు చెన్నై రెండు వికెట్ల నష్టానికి 110 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. 8 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. ఓపెనర్‌గా వచ్చిన అజింక్యా రహానే(5) ఔటయ్యాడు. ముంబై పేసర్ కొయేట్జీ బౌలింగ్‌లో భారీ షాట్ ప్రయత్నించి ప్యాండ్యాకు దొరికాడు. నబీ, బుమ్రాలు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రెండు ఓవర్లలో బౌండరీలు రాలేదు. అయితే.. కొయేట్జీ వేసిన ఐదో ఓవర్లో ప్రస్తుతం రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కానీ, కొంత సేపటకే ఓపెనర్ రచిన్ రవీంద్ర (21)ని శ్రేయాస్ గోపాల్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన దూబే జతగా జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు.