రాజ్కోట్: యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (129 బంతుల్లో 117, 12 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక తొలి వన్డేను భారత ‘ఏ’ జట్టు గెలుచుకుంది.
ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సౌతాఫ్రికా నిర్దేశించిన 286 పరుగుల ఛేదనలో గైక్వాడ్ సెంచరీకి తోడు కెప్టెన్ తిలక్ వర్మ (39), నితీశ్ కుమార్ రెడ్డి (37) రాణించడంతో భారత జట్టు 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మొదట సఫారీ జట్టు 53 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయినా డెలానొ (90), ఫారెస్టర్(77) నిలకడగా ఆడి ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో దోహదపడ్డారు.